ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం 

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం 

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.

Read More కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి  -