రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకే మా పోరాటం:ధర్మ సమాజ్ పార్టీ 

రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకే మా పోరాటం:ధర్మ సమాజ్ పార్టీ 

రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకే మా పోరాటం

విశ్వంభర, ఆమనగల్లు: అణగారిన వర్గాలైన పేద ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు,విద్యా,వైద్యం, ఉపాధి,భూమి,ఇల్లు అందించాలని ప్రధానమైన అంశాలపై ఆమనగల్లు తాహాసీల్దార్ కార్యాలయం ముందు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 25 శాతం నిధులు విద్యకి కేటాయించాలని, 25 శాతం నిధులు వైద్యానికి, 25 శాతం నిధులు ఉపాధికి కేటాయించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రీలే నీరహదీక్షలు రాస్తారోకోలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ధర్మ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ కల్వకుర్తి నియోజకవర్గం ఇంచార్జీ వంకేశ్వరం రమేష్, ఆమనగల్లు మండల నాయకులు బలరాం తలకొండపల్లి మండల నాయకులు జగన్ మాడుగుల మండల నాయకులు హరి, ప్రవీణ్, యాదగిరి, మహేష్, గోపాల్ నాయక్, పరమేశ్వర్, శ్రీశైలం,శివ,జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: