మానవత్వం చాటుకున్న మహారాజు
On
విశ్వంభర, షాబాద్ : షాబాద్ మండల కేంద్రంలోని తిరుమలాపూర్ గ్రామంలో చాలా రోజులుగా గ్రామస్తులు నీటి కొరతతో బాధపడుతున్నారు. ఇది గమనించిన గ్రామానికి చెందిన తిమ్మన్నోళ్ల శ్రీరాంరెడ్డి ముందుకు వచ్చి మానవత్వంతో గ్రామంలో కొత్త బోర్ మోటర్ గ్రామానికి ఇప్పించారు. అయితే గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉండటం వల్ల ఆ సమస్యను గ్రామపంచాయతీ వారు తీర్చలేకపోయారు. తన వంతు సహాయ సహకారాలు గ్రామానికి ఎల్లవేళలా ఉంటాయని ఆయన తెలిపారు. కొత్త మోటార్ ను అందించిన తిమ్మన్నోళ్ల శ్రీరాంరెడ్డి గ్రామస్థులు, ప్రజలు, అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బందయ్య, రాజు, సత్తయ్య ,మల్లేష్ ,కృష్ణయ్య, బిక్షపతి ,రాములు, కృష్ణ, శీను, తదితరులు పాల్గొన్నారు.