రైతుకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం: ⁠కే ఎల్ ఆర్ 

రైతుకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం: ⁠కే ఎల్ ఆర్ 

* ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 

* ఫోర్త్  సిటీలో భవిష్యత్ అవసరాలను తగ్గట్టు మౌలిక సదుపాయాలు 

విశ్వంభర, మహేశ్వరం, కందుకూరు :  ప్రతిపక్షాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, విమర్శించిన సంక్షేమం ఆగదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం  మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ కందుకూరు మండలం నేదునురు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల మేనీ పేస్టలో పెట్టిన వాగ్దానాలను నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడదిలోపే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ -1 పరీక్ష నిర్వహించలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రూప్ -1 పరీక్ష ను నిర్వహించమన్నారు. రైతంగానికి ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు  500 రూపాయలు బోనస్ ను  నెరవేర్చి ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేస్తామన్నారు . తరుగు పేరుతో రైతులు మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కొత్త నగరం నిర్మాణం జరుగుతుందన్నారు.  ప్రజల అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టో లో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు ఐటీ శాఖ మంత్రి రంగారెడ్డి  జిల్లా ఇన్చార్జ్  మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు . మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి  కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి , తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ బరిగేలా హేమలత రాజు గౌడ్ . కాంగ్రెస్ పార్టీ నాయకులు . మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  కే ఎల్ ఆర్, దేప భాస్కర్ రెడ్డి , ఏనుగు జంగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బొక్క జంగారెడ్డి, పలు శాఖల అధికారులు,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ  గ్రామాల మాజీ సర్పంచులు , జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,
పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags: