కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి -
On
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో వినతి
విశ్వంభర , మేడ్చల్ మల్కాజ్గిరి : కుత్బుల్లాపూర్-కూకట్పల్లి-ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి చేతుల మీదుగా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత అమిత్ షా కు , అలాగే బిజెపి పార్టీకి లేదని తెలియజేశారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదని బిజెపి సొంత రాజ్యాంగాన్ని సృష్టించేందుకే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పార్లమెంట్ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు సరికావని భారత దేశ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు. వీరితో పాటు మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ , ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి , కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, టిపిసిసి కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మహిళా కార్యదర్శి సరిత, జిల్లాలోని మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని ఏ బ్లాక్, బి బ్లాక్ కార్పొరేషన్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు, మండల మున్సిపల్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ అనుబంధ సంస్థ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు