నాణ్యమైన కోతలు లేని విద్యుత్తును అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

నాణ్యమైన కోతలు లేని విద్యుత్తును అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

నాణ్యమైన కోతలు లేని విద్యుత్తును అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

విశ్వంభర, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలో సుమారు రూ.110 లక్షలతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు ఒడితల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన కోతలు లేని విద్యుత్ ను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. నైన్ పాక సబ్ స్టేషన్ లో మొత్తం మూడు ఫీడర్లు(నైన్ పాక, చైన్ పాక, వరికోల్ పల్లి) ద్వారా నిరంతర విద్యుత్ సౌకర్యం అందనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే, తప్పక అమలు చేస్తుందని తెలిపారు.

Tags: