కస్తూర్బా గాంధీ  పాఠశాల/కళాశాల  తనిఖీ చేసిన:సబితా ఇంద్రారెడ్డి  

* విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన రేవంత్ సర్కార్ 

విశ్వంభర, మహేశ్వరం: కందుకూరు మండలం కొత్తగూడ  కస్తూర్బా బాలికల పాఠశాల, కళాశాలను అకస్మాత్తుగా  తనిఖీ చేసి స్థితిగతులను పరిశీలించి విద్యార్థులతో మాటామంతి నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి . ఎమ్మెల్యే  మాట్లాడుతూ విద్యార్థులకు అందజేస్తున్న భోజనం నాణ్యత పరిశుభ్రత పాటించాలని  ముఖ్యంగా టాయిలెట్లు ఇతర పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచాలని  అధికారులను ఆదేశించారు.  విద్యార్థులారా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా  ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి అంటూ తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ని విద్యార్థులకు అందజేశారు. సదుపాయాల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. భోజనశాల అందులో వంట సామాగ్రి అందజేస్తున్న అన్నం  కూరగాయలు బియ్యాన్ని  ఇతర సామాగ్రిని  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: