తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం.
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం.
విశ్వంభర,హైదరాబాద్;టీయూసీఐ ఆధ్వర్యంలో రైతు పండగకు అమిస్తాపూర్ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కార్మికులను పోలీసులు ముందస్తు గా అరెస్టు చేశారు. టి.యు.సి.ఐ జిల్లా కార్యదర్శి సాంబశివుడు వెంకట రాములు కిష్టన్న బాలరాజు రాజేందర్ నర్సమ్మ తదితరులు దేవరకద్ర పోలీస్ స్టేషన్ కు తరలించారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని , అదేవిధంగా 60 జీవోను అమలు చేయాలని, ఇవ్వాలని గ్రామపంచాయతీ జీతాలు ప్రత్యేక నిధి ద్వారా ప్రభుత్వము ఇవ్వాలని, పనిముట్లు డ్రెస్సులు ఇన్సూరెన్స్ ఈఎస్ఐ వారాంతరం సెలవులు పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ధర్నా చేస్తుంటే ప్రస్తుత ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు తెలియజేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా మీ యొక్క డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా గాని కార్మికుల సమస్యలు ఊసేత్తడం లేదు నిజానికి ఇది ప్రజా ప్రభుత్వమా మొండి ప్రభుత్వము ఆలోచించాల్సిన సమయం ఉన్నది కావున ఈ యొక్క అరెస్టులను వెంటనే ఖండిస్తూ మా యొక్క డిమాండ్ అమలు చేయాలని సీఎంని కోరారు.