పేటలో ఘనంగా సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
On
విశ్వంభర, సూర్యాపేట్ : మాజీమంత్రి , స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సతీమణి, ఎస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు సూర్యాపేట లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబురంగా జన్మదిన వేడుకలు జరిపారు.