రోశయ్య వర్ధంతి సభకు తరలిరావాలి - మీడియా కమిటీ ఛైర్మన్ కౌటిక విఠల్
On
విశ్వంభర, హైదరాబాద్ : వివాదరహితుడు, నిరాడంబరుడు, 16 సార్లు ఆర్థికమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 4న హైటెక్స్ నిర్వహించే కా ర్యక్రమానికి ఆర్యవైశ్యులు పెద్దఎత్తున తరలిరావాలని మీడియా కమిటీ చైర్మన్ కౌటిక విఠల్ విలేకరుల సమావేశంలో కోరారు. ప్యాష్టిహల్ నందు వైశ్యజర్న లిస్టులు,పత్రికల,మీడియా ఎడిటర్లు, యజమానులతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యక్తిత్వం, పని విధానం, రాజకీయ చతురతను, వైశ్య జాతికి వారు చేసిన సేవలను వైశ్యులందరికి తెలిసేలా విస్తృత కవరేజీ చెయ్యాలని కోరారు.