జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి

జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి

జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి

విశ్వంభర, మహబూబాబాద్:శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో లెనిన్ వత్సల్ టోప్పో  ఆధ్వర్యంలో ఎల్సీడీసీ పైన  జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలని, కేసులు లేకుండా చూడాలని, ప్రతి ఒక్కరిని  పరీక్షించాలని మందులు త్వరగా వాడినచో  అంగవైకల్యం లేకుండా ఉండొచ్చని పేర్కొంటూ ఈ పక్షోత్సవాలు డిసెంబర్ 2 నుండి 15 వరకు ప్రతి ఇంటింటికి ఆశా కార్యకర్త  వెళ్లి ఇంట్లో ఉన్న వారందరికీ  చర్మం పైన ఏమైనా మచ్చలు ఉన్నచో  అనగా స్పర్శ లేకుండా రాగి వర్ణం గల మచ్చలు ఉన్న వారిని గుర్తించి దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి దగ్గరికి పంపించాలని, దీనికి లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా  సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందంజలో ఉంచాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి మురళీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్, డాక్టర్ రాజకుమార్ జాదవ్,పురుషోత్తం సీఈఓ, డీపీఓ, డిస్టిక్ పారామెడికల్ ఆఫీసర్ వాలియా,  ఎల్లయ్య, కెవి రాజు హెల్త్ ఎడ్యుకేటర్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, ఎపిడిమాలజిస్ట్ రవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags: