కామధేను బెస్ట్ ఫాదర్ అవార్డు అందుకున్న డా. మనోజ్ కు పుట్టి హరికుమార్ ప్రశంసలు
విశ్వంభర, ఏలూరు జిల్లా : మదినేపల్లి: - కామధేను బెస్ట్ ఫాదర్ అవార్డు అందుకున్న డాక్టర్ మనోజ్ ను శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వగురు వరల్డ్ రికార్డ్సు సీ.ఈ.ఓ. ఎస్. రాంబాబు వారిచే కామధేను నేషనల్ బెస్ట్ ఫాథర్ గా డాక్టర్ అంబుల మనోజ్ కు అవార్డు ఇవ్వటం అంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. పేదలకు వైద్యం చేస్తూ నీతిగా, నిస్వార్ధంగా, పేదవారికి సహాయం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తనకున్న ఆస్తులు, బంగారం, విక్రయించి షుమారు రూ.40 లక్షలను రాజధాని నిర్మాణానికి, పలు అభివృద్ధి పనుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు కు అందజేసి గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తిగా ప్రశంసలు పొందుతూ.. రాజధాని అభివృద్ధి కోసం తొలి అడుగులు వేస్తున్న డాక్టర్ మనోజ్ ముదినేపల్లి లో ఉండటం మండల ప్రజల గర్వించదగ్గ వ్యక్తి అని శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరి కుమార్ మీడియా ద్వారా తెలియచేసి దుస్సాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర శ్రీకృష్ణ యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు.