అద్దంకి నార్కట్ పల్లి హైవేపై నందిపాడులో బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు
On
విశ్వంభర, నల్గొండ జిల్లా : ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రాళ్ళ కుప్పను ఢీకొని బోల్తా పడిన సంఘట మిర్యాలగూడ లో అద్దంకి నార్కట్ పల్లి హైవేపై నందిపాడు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రయాణికులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు నుండి 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతి వేగంతో వాస్తు డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం ప్రమాదానికి గల కారణంగా ప్రయాణికులు తెలిపారు.