రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వం  మొసలి కన్నీరు: మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ 

రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వం  మొసలి కన్నీరు: మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ 

రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వం  మొసలి కన్నీరు

విశ్వంభర, కడ్తాల్ : కాంగ్రెస్ సర్కారు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ రైతులకు నయా పైసా న్యాయం చేయకుండా రైతు పండగ చేయడం హాస్యాస్పదంగా ఉందని కడ్తాల్ మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. రేవంత్ సర్కార్ రైతుల కోసం చేస్తుంది రైతు పండగ కాదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే దండగాని మండిపడ్డారు. రైతు పండగ కోసం రైతులు ఎవ్వరూ రావడానికి ఇష్టపడట్లేదని తమను నమ్మించి నట్టేట ముంచిన రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారని ఫైర్ అయ్యారు. కడ్తాల్ మండల కేంద్రంలో రుణమాఫీ కానీ రైతులతో సెల్ఫీలు దిగి రేవంత్ సర్కార్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నామని తెలిపారు. రైతులకు రుణమాఫీ కాలేదని, రెండు పంటలు పండించిన ఇంతవరకు రైతుబంధు రాలేదని మండిపడ్డారు. దీనికి తోడు పాడి రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని తెలిపారు. అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ బ్రోకర్ మాటలేనని అధికారంలో వచ్చినంక కూడా అదే బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. రుణమాఫీ కానీ రైతులతో తాము దిగిన సెల్ఫీలను చూసి అయినా రేవంత్ సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. రైతు పండగ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు ఎవరు రావడానికి సుగుముఖంగా లేరని రైతు పండుగకు రావాలని ఏవోలు రైతులను బతిమిలాడుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, సులోచన సాయిలు, భాగ్యమ్మ, జంగయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ,  మంగళపల్లి నరసింహ, అశోక్ మహేష్, రామచంద్రయ్య, రైతులు పాల్గొన్నారు.

Tags: