కోటి మెటర్నటీ హాస్పిటల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ -ఆర్యవైశ్య మహాసభ
విశ్వంభర, హైదరాబాద్ : జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో, ఆదివారం, ఉదయం, "కోటి మెటర్నటీ హాస్పిటల్లో" పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. సుమారు 300 మందికి దుప్పట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా పూర్వక పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా హాజరై దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగిస్తూ, పేదలకు వస్త్ర దానం చేయడం గొప్ప విషయం అన్నారు. నేను చాలా సంతోషిస్తూ నా ద్వారా కూడా ఏదో ఒక సహాయం పేదలకు తప్పకుండా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సరాబు లక్ష్మణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కటకం శివకుమార్ గుప్తా, ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్, కోశాధికారి లింగా ప్రకాష్ గుప్తా, మారం సురేష్ ,ఐ.పి.పి .మేడం దయాకర్ గుప్త ,అదనపు ప్రధాన కార్యదర్శి సత్యం గుప్త, ప్రాజెక్టు కన్వీనర్ కూర రఘువీర్, ప్రాజెక్టు చైర్మన్ సరాబు ఉదయ్ భాస్కర్ గుప్తా, ప్రాజెక్టు కో చైర్మన్ కటకం వినోద్ కుమార్, సహాయకుశాధికారి చింతల్ ఘాట్ శ్రీరామ్ గుప్తా ,తదితరులు పాల్గొన్నారు.