హిందూ సమాజం  ఏకం కావాలని రామాలయం కమిటీ  పాదయాత్ర

హిందూ సమాజం  ఏకం కావాలని రామాలయం కమిటీ  పాదయాత్ర

హిందూ సమాజం  ఏకం కావాలని రామాలయం కమిటీ  పాదయాత్ర

విశ్వంభర, మిర్యాలగూడ:నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్ పేట  శ్రీ సీతారామాంజనేయ దేవాలయం నుండి అవంతిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా నగర సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ సనాతన ధర్మాన్ని  హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మ పరిరక్షణ, భవిష్యత్తులో జరిగే వీఘాతాలను చేదించడం కోసం హిందూ సమాజం ఏకం కావాలని కోరుకుంటూ హనుమాన్ పేట రామాలయం కమిటి వారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్రను చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా కమిటీ కార్యదర్శి కూరపాటి సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో హిందూవులపై జరిగే దాడులను ఖండిస్తూ హిందూ శక్తి ఐక్యత కోసం హనుమాన్ పేట రామాలయం వేదికగా సనాతన ధర్మమాన్ని మన దేవి దేవతల ప్రాముఖ్యాన్ని  ప్రజల్లోకి తీసుకోని వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామ్మన్నారు. అలాగే ఇస్కాన్ కృష్ణదాస్ అక్రమ అరెస్ట్ ను వెంటనే వాపసు తీసుకోని బంగ్లాదేశ్ ప్రజలు వెంటనే క్షమాపన చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిలుకూరి శ్యామ్, లక్ష్మినారాయణ, కుప్పాల సబ్బారావు, దేవేందర్, లక్ష్మి, శివప్రసాద్,కుప్పల శ్రీను సునీత, రమణ, కుమారి, ధనలక్ష్మి,జాహ్నవి రామలక్ష్మి, దాచేపల్లి మురళి మల్లయ్య,సత్యం నర్సింహా రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags: