మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
On
మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
విశ్వంభర, పటాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రం లోని 7 వ వార్డు లో నింబోజి శ్రీకాంత్ చారి స్వామి స్వగృహంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ,మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఏటా మాల ధారణ చేసి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని కొలవడం చాలా గొప్ప విషయమన్నారు. కిరణ్ కుమార్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ శాస్త్రోత్తంగా నిర్వహించారు. స్వాములు అయ్యప్ప భక్తులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.