గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి
గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని రామన్నపేట నుండి కొమ్మాయిగూడెం వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రయాణాలు నరక ప్రాయంగా మారుతున్నాయని, ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే గుంతలను పూడ్చి మరమ్మతులు చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగటి ఉపేందర్ డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన అనంతరం డి.ఈఈ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారి గుంతలమయంగా మారినాయని, రోడ్ల వెడల్పులో భాగంగా వేసిన నూతన రోడ్డు కూడా ప్రమాదకరంగా మారి ప్రమాదాల జరుగుతున్నాయని అన్నారు. పలుసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వ అధికారులు చొరవ చూపి గుంతల రోడ్లను మరమ్మత్తులు చేసి, ప్రజల సమస్యను పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, డీవైఎఫ్ఐ మండల నాయకులు గుణగంటి మల్లేశం, ఆకిటి శ్రీనివాస్, జల్లెల మల్లేశం, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.