డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 22 వ వార్షికోత్సవం

డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 22 వ వార్షికోత్సవం

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
- ఎమ్యెల్యే మైనంపల్లి రోహిత్ 

విశ్వంభర, హైదరాబాద్ : సంపూర్ణ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్యెల్యే మైనంపల్లి రోహిత్ ఉద్ఘాటించారు. నిబద్ధతను ప్రతిబింబించే ప్రతిభ, సృజనాత్మకత, క్రమశిక్షణ విద్యార్థులు కలిగిఉండాలని, వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధికి విద్య మూలస్తంభం అని తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి లో డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 22 వ వార్షికోత్సవం 'అభ్యుదయ' పేరుతో ఆదివారం ఘనంగా జరిగింది. స్కూల్ క్యాంపస్ లో జరిగిన ఈ వార్షికోత్సవంలో స్కూల్ పూర్వ విద్యార్ధి, యువ ఎమ్యెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్యఅతిథిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ నక్క ప్రభాకర్ గౌడ్ గౌరవ అతిథిగా,  డిఆర్ఎస్ ఐఎస్ చైర్మన్ దయానంద్ అగర్వాల్, డైరెక్టర్లు అంజనీ కుమార్ అగర్వాల్, సంజయ్ కుమార్ అగర్వాల్, గార్వ్ అగర్వాల్, ప్రిన్సిపాల్ షణ్ముగం పరమశివాన్, వైస్ ప్రిన్సిపాల్ డా. కృష్ణమోహన్  వేదికపై ఆసీనులైనారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే మైనంపల్లి రోహిత్  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర బహుముఖమైనది మరియు కీలకమైనదని, విద్యార్ధులు ఒక దేశం యొక్క భవిష్యత్తు నాయకులు, ఆవిష్కర్తలు మరియు మార్పును సృష్టించేవారని, వారు దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతికి దోహదపడే జ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను సంపాదించాలన్నారు. డిఆర్ఎస్ ఐఎస్ పూర్వ విద్యార్థిగా ఈ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నందుకు గర్వాంగా ఉందని, విద్యార్థులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. దయానంద్ అగర్వాల్ మాట్లాడుతూ మన జీవితాన్నంతటినీ మార్చే శక్తి విద్యకు ఉందని,  నేర్చుకోవడం మీ ఆలోచనా సామర్థ్యాలను మరియు అవగాహనను మారుస్తుందన్నారు. విద్య యొక్క ప్రాముఖ్యత విద్య అనేది ఒకరి జీవితంలో ఒక ముఖ్యమైన అంశామని, ఇది భవిష్యత్తులో విజయం సాధించడానికి మరియు మన జీవితంలో అనేక అవకాశాలకు కీలకం అని అన్నారు. మన జీవితాలను ఆధునిక సాంకేతికతతో గడుపుతున్నామని, అనేక విధాలుగా మనం జీవిస్తున్న ప్రపంచం లో కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లు మరియు ఇంటర్నెట్‌ను ఉపయోగించకుండా పని చేయడంలేదని, కానీ ఈ సాంకేతికతలను మంచికే ఉపయోగించాలని దుర్వినియోగం చేయవద్దని కోరారు. ఎమ్యెల్యే మైనంపల్లి రోహిత్ విద్యార్థులకు అకడమిక్‌తోపాటు కో-కరిక్యులర్‌ విభాగాల్లో సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి పలువురు టీచర్లను సన్మానించి వారితో ముచ్చటించి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులచే ఆర్కెస్ట్రా, ఫ్యూజన్ డ్యాన్స్,  చిన్నారుల అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. క్యాంపస్ ఆవరణ లో ఏర్పాటుచేసిన విద్యార్థుల పెయింటింగ్ ప్రదర్శన పలువురును ఆకట్టుకుంది.

Tags: