శ్రీకాంతాచారికి  మరణం లేదు - ఎమ్మెల్సీ మధుసూదన చారి

శ్రీకాంతాచారికి  మరణం లేదు - ఎమ్మెల్సీ మధుసూదన చారి

తెలంగాణ జాతి ఉన్నంతవరకు ఆయన బ్రతికే ఉంటాడు  

విశ్వంభర, చైతన్యపురి : మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసుకున్న కాసోజు శ్రీకాంతాచారి పదిహేను వర్ధంతి సందర్భంగా చైతన్యపురి సెంటర్ లో వారి చిత్రపటానికి బిఆర్ యస్ పార్టీ  శాసనమండలి ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, V 3 న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక,టివి ఛైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.WhatsApp Image 2024-12-03 at 14.20.19 ఈ సందర్బంగా డా. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకున్న కాసోజు శ్రీకాంతాచారి మరణం తీరని లోటు అని , ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆహుతై చావు బ్రతుకల్లో ఉన్న శ్రీకాంతాచారి ఒకవేళ తానూ బ్రతికితే మళ్ళీ తెలంగాణ కోసం చావడానికి సిద్ధంగా ఉన్నానని నాటి సందర్భంలోని విషయాలను గుర్తు చేసారు. ఎమ్మెల్సీ మధుసూదన చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తోలి అమరుడు శ్రీకాంతాచారి నాటి ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి , యావత్తు  తెలంగాణ జాతిని ఐక్యం చేసిన ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతాచారి అని అన్నారు. తెలంగాణ జాతి ఉన్నంతవరకు శ్రీకాంతాచారి కి మరణం లేదని అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో పార్టీ అధిష్టానం తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. WhatsApp Image 2024-12-03 at 14.20.21 (2) మాజీ గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్  పల్లె రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంలో ఎంతో మంది అమరులు అయ్యారు. పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల తరవాత తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, తెలంగాణ రాష్ట్రం కోసం తన ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మర్పణ చేసుకున్న శ్రీకాంతాచారి తన శరీరాన్నే ఒక కాగడ లా చేసుకొని ఈ రాష్ట్రం కోసం బలి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రం శ్రీకాంతాచారి త్యాగాన్ని మరవదు. 15 వ వర్ధంతి సందర్బంగా వారికి ఇవే మా ఉద్యమ నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు  దాము మహేందర్ యాదవ్ , బిఆర్ఎస్  రాష్ట్ర నాయకులు డాక్టర్ కిరణ్ కుమార్, ఇరుగు శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ కార్యదర్శి కోదుమూరు దయాకర్ రావు, సమాచార హక్కు వికాస సమితి  వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్  యర్రమాధ కృష్ణారెడ్డి, కూర రమేష్, మేడికొండ  పరమేష్, విజయ్, చిన్న గౌడ్, ఉప్పల శ్రవణ్, కాచం సాయి  నివాళులు అర్పించారు.

Tags: