యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి
బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి
విశ్వంభర, హనుమకొండ: యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహాన్ని నింపాలన్నదే బి.వి.ఆర్ సైంట్ లక్ష్యమని సంస్థ సీఈవో డాక్టర్ సుధాకర్ తెలిపారు. వ్యవస్థాపన వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించేందుకు వరంగల్ నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం హనుమకొండ జిల్లా మడికొండలోని ఐటి పార్కులో గల సైయేంట్ కార్యాలయంలో డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రి షిప్(బివిఆర్ సైంట్) సహకారంతో విద్యార్థుల మాస్టర్ క్లాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 25 పైగా ఇంజనీరింగ్ కళాశాల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు సృజనాత్మకతతో సమస్యలు పరిష్కరించడానికి అవకాశాలను సృష్టించడానికి ఇంజనీరింగ్ ఒక ప్రక్రియ లాంటిదని అన్నారు. ఇది సాంకేతిక నైపుణ్యాలకు సంబంధించింది కాదని సమస్యల పరిష్కారానికి సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే ఒక పదునైన ఆలోచనకు దారి వేసేదని అన్నారు. ఈ తరం ఇంజనీర్లను సాంకేతికత, వ్యాపార మరియు సమాజంలో అగ్రగామిగా తయారు చేయవచ్చనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బి.వి.ఆర్ సైంట్ ఫౌండేషన్ ద్వారా పలు దాతృత్వ సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి సహాయపడుతున్నట్లు తెలిపారు. ఈ ఫౌండేషన్ చొరవతో గ్రామీణ మరియు పట్టణ నిరుద్యోగ మహిళలకు సాధికారత కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.వి.ఆర్ సైంట్ సంస్థ ప్రతినిధులు, సెయేంట్