విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

విశ్వంభర, చింతపల్లి:రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ తలపెట్టిన ప్రభుత్వ పాఠశాలల బంద్ కార్యక్రమం విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ షంషుద్దీన్ అన్నారు. మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పాలన పూర్తయిందని సంబరాలు చేసుకున్నారు. కాని ఇప్పటి వరకు విద్యా వ్యవస్థపై సమీక్షా చేయలేదని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, జిల్లా పరిషత్,  ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత లేని కారణంగా రాష్ట్ర  వ్యాప్తంగా విద్యార్థులు పుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురవుతున్నారు. వరుస ఘటనలపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ ప్రభుత్వ పాఠశాలల బంద్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు చింతపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను  బంద్ చేయడం జరిగింధని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చింతపల్లి మండల అధ్యక్షుడు వలవోజు శివ, నాయకులు ఎర్ర చిన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: