స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండాలి

విశ్వంభర, మహబూబాబాద్: డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్  అథారిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్  జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్త్రీ పురుషుల నిష్పత్తి  సమానంగా ఉండేటట్టు  ప్రజలలో అవగాహన కల్పించాలని, స్కానింగ్ సెంటర్లను  తనిఖీలో భాగంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు గుర్తిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోబడునని, స్కానింగ్ సెంటర్లలో  క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే పనిచేయాలని,  జిల్లాలో ఎక్కడైతే స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న  గ్రామలను గుర్తించి కలజాత బృందాల చే అవగాహన కార్యక్రమాలు  చేపట్టాలని, చట్ట ప్రకారం అన్ని జన్యు సంబంధ పద్ధతులు పరీక్షలు నిర్వహించే వ్యక్తులు సంస్థలు ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలు వైద్యులు సంబంధిత జిల్లా ప్రత్యేక నిర్దేశిత అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వద్ద తప్పనిసరిగా నిర్దేశించిన రుసుముతో నమోదు చేయించుకోవాలని, చట్ట పరిధిలో అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలు లేదా పరికరాలు తప్పనిసరిగా నమోదు చేయించాలని, నమోదు చేయించుకున్న తర్వాత తిరిగి ఐదు సంవత్సరాలకు ఒకసారి తిరిగి రెన్యువల్ చేయించుకోవాలని  పేర్కొన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు సమానమే అని, స్త్రీ పురుషుల మధ్య ఏ వివక్షత ఉండకూడదని నిజానికి పురుషుడు కంటే స్త్రీ ఏ విషయంలో తక్కువ కాదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు గణేష్ కే. కృష్ణవేణి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతిరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీల, ప్రోగ్రాం ఆఫీసర్స్  డాక్టర్ సారంగం, డాక్టర్ శ్రవణ్ కుమార్, కె.వి.రాజు హెల్త్ ఎడ్యుకేటర్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, ఎల్డి కంప్యూటర్ అరుణ్,  మనోహర్ పాల్గొన్నారు.

Tags: