మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం
జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా శిక్షకుడు
విశ్వంభర, చండూర్ : సన్ పవర్ మార్షల్ ఆర్ట్స్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో 23 వ సన్ పవర్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర స్థాయి పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థుల స్కూల్ యాజమాన్యాలు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా కరాటే శిక్షకుడు మాస్టర్ కారింగు రవి ని, విజేతలకు ఆయా స్కూల్ యాజమాన్యాలు ఘనంగా సన్మానించారు. గాంధీజీ, గీత, కేజీబివి, మరియానికేతన్, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు 6గురు గోల్డ్ మెడల్స్ ఐతరాజు జశ్వంత్, సంకోజు మణిదీప్, కారింగు మోక్షలక్ష్మి, కారింగు అభిరామ్, జన ఓమ్, కావలి శశాంక్ పొందారు. 9మంది సిల్వర్ కారింగు అనురూప్, సంకోజు సాయి ప్రణయ్, నక్కపోతు శృతి, దోమలపల్లి వైష్ణవి, దోమల పల్లి క్రిష్, యశ్వంత్, బీమనపల్లి వీణ లకు సాధించారు. గెలుపొందిన విజేతలకు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. మాస్టర్ రవి మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యార్థులకు మరింతగా శిక్షణ అందించి రాష్ట్ర , జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.