వంటగది ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్ ఐ
On
వంటగది ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్ ఐ
విశ్వంభర, పెద్ద శంకరంపేట:ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల పలుచోట్ల విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న దృష్ట్యా పెద్ద శంకరంపేటలోని కేజీబీవీపీ పాఠశాలలోని వంటగదితోపాటు పాఠశాల పరిసరాలను పెద్ద శంకరంపేట ఎస్సై శనివారం ఆకస్మికంగా పరిశీలించారు.శంకరంపేట మండలంలోని కేజీబీవీ హాస్టల్ పరిసరాలను కూరగాయలను గుడ్లను, వంటశాలను పరిశీలించిన ఎస్సై మంట వారికి పలు సూచనలు చేశారు. పాడైపోయిన కూరగాయలతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించకూడదని సూచించారు. మెనూ ప్రకారం పౌష్టికాహరాన్ని అందించాలని ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని వారికి సూచించారు. ఎస్ఐ వెంట కేజీ వి బి ప్రిన్సిపాల్ ఉన్నారు.