కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమకాలిన సమస్యల పరిష్కారంపై సమీక్ష 

కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమకాలిన సమస్యల పరిష్కారంపై సమీక్ష 

కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమకాలిన సమస్యల పరిష్కారంపై సమీక్ష 

విశ్వంభర, హనుమకొండ: కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ ప్రతాప్ రెడ్డి,రిజిస్టర్ మల్లారెడ్డి పాలక వర్గం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి,మౌళిక సదుపాయాల కల్పన,విద్యార్థుల సుదీర్ఘ,సమకాలిక సమస్యల పరిష్కారంపై పరిపాలన భవన మందిరంలో స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య  తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో  అన్ని విభాగాల అధ్యాపకుల గురించి పలు అంశాల పైన కూలంకుషంగా చర్చించటం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలను  నిర్వీర్యం చేయగా నేడు మన ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యార్థులు ఇబ్బంది పడవద్దనే సదుద్దేశంతో యూనివర్సిటిని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు.

యూనివర్సిటీ భూమూలను అన్యాక్రాంతం అయ్యాయి అనే అంశం పైన  కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల గురించి నాక్ నుంచి వచ్చే నిధుల గురించి పార్ట్ టైం అధ్యాపకుల జీతభత్యాలు తదితర అంశాల పైన కూలంకుషంగా చర్చించటం జరిగిందన్నారు.
యూనివర్సిటీ అభివృద్ధి మీద ఒక డీపీఆర్ తయారుచేసి గౌరవ  రేవంత్ రెడ్డి కి  అందజేసి అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఒక చరిత్ర లో నిలిచిపోయే విధంగా విద్యార్థి విద్యార్థినీలు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి ఎన్నో కేసులపాలై జైలకు వెళ్లిన వారు ఉన్నారు. రాబోయే తరాల కోసం ఒక విద్యావ్యవస్థగా రూపుదిద్దుకుంటున్న యూనివర్సిటీని అన్ని రకాల వసతులు కల్పించాలని, సానుకూలంగా స్పందించే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో హాస్టల్ వసతి తదితర అంశాలపై చర్చించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో తుగ్లక్ పాలన చేసి యూనివర్సిటీలను నిర్వేర్యం చేస్తూ ప్రైవేట్ కాలేజీలకు కేటాయిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను బ్రష్టు పట్టించారన్నారు. బీఆర్ఎస్ తుగ్లక్ పాలలను చూసి ప్రజలు విసిగిచింది గొప్ప మనసుతో ప్రజలందరూ మన ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టారన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాగా సుమారు 50 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాము మళ్లీ త్వరలోనే మరొక కొత్త నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి విద్యార్థినీలను యూనివర్సిటీ భూములను కాపాడే బాధ్యత నేను మా ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకొని త్వరగా అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తామన్నారు.
యూనివర్సిటీలో తొందర లోనే మళ్లీ  ఒక సమీక్ష సమావేశం నిర్వహించుకుని మళ్లీ కులం కుశంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.ఈ సమావేశంలో ఎక్జిక్యూటివ్ మెంబర్స్ అనితా రెడ్డి,చిర్ర రాజు,సురేష్ లాల్,రమ,పుల్లూరు సుధాకర్, సుదర్శన్ కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థల ప్రిన్సిపల్స్,డీన్ లు ,విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం

Tags: