పారా లీగల్ వాలంటీర్లు వారధిలా ఉండాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి.
విశ్వంభర, రంగారెడ్డి జిల్లా : ప్యారా లీగల్ వాలంటీర్లు ప్రజలకి, న్యాయ సేవ సంస్థ కి వారధిలా ఉండాలి అని రంగా రెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి , రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు గురువారం రంగారెడ్డి జిల్లా న్యాయ సేవ సంస్థ అద్వర్యం లో కొత్తగా ఎంపికచేయబడిన ప్యారా లీగల్ వాలంటీర్లకు , ఇదివరకు ఉన్న ప్యారా లీగల్ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ శిబిరం శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిది గా హాజరు అయ్యారు. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ పారా-లీగల్ వాలంటీర్లు ప్రజలకు, ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వారికి, మానవ గౌరవంతో జీవించే హక్కు గురించి తెలుసుకునేలా, రాజ్యాంగబద్ధంగా , చట్టబద్ధంగా హామీ ఇవ్వబడిన అన్ని హక్కులతో పాటు విధులు బాధ్యతలను నిర్వర్తించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు. పారా-లీగల్ వాలంటీర్లు వివాదాలు, సమస్యలు, సమస్యల స్వభావాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సంస్థల ద్వారా వివాదం, సమస్య, సమస్యలను పరిష్కరించేందుకు వారు మండల న్యాయ సేవ సంస్థ, జిల్లా న్యాయ సేవ సంస్థ, రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ని సంప్రదించవచ్చని ప్రజలకి తెలియజేయాలి. స్థానికంగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వాలంటీర్లకు సమాచారం అందినప్పుడు, వాలంటీర్లు పోలీసు స్టేషన్ ను సందర్శించి, అవసరమైతే, సమీపంలోని న్యాయ సేవల సంస్థల ద్వారా అరెస్టయిన వ్యక్తికి న్యాయ సహాయం అందేలా చూడాలి. ప్యారా లీగల్ వాలంటీర్లు ప్రజలకి న్యాయ సేవ సంస్థ కి వారధిలా ఉండాలి అన్నారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ పట్టాభి రామ రావు మాట్లాడుతూ" వాలంటీర్లు జిల్లా న్యాయ సేవ సంస్థ, రాష్ట్ర న్యాయ సేవ సంస్థ నుండి సరైన అధికారంతో జైళ్లు, లాక్-అప్లు, సైకియాట్రిక్ హాస్పిటల్స్, చిల్డ్రన్స్ చేత శిక్షణ ఇప్పించారు. శిక్షణా శిబిరాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి / సీనియర్ సివిల్ జడ్జి . శ్రీదేవి మాట్లాడుతూ"పారా లీగల్ వాలంటీర్లు చట్ట ఉల్లంఘనలపై నిరంతరం నిఘా ఉంచాలి. స్థానికంగా పీ ఎల్ వి ఒక వ్యక్తి అరెస్టు గురించి సమాచారం అందుకున్నప్పుడు పీ ఎల్ వి పోలీస్ స్టేషన్ ను సందర్శించి, అరెస్టు చేయబడినట్లు నిర్ధారించుకోవాలి అవసరమైతే, సమీపంలోని న్యాయ సేవల ద్వారా వ్యక్తి న్యాయ సహాయాన్ని అందించాలి. శిక్షణ కార్యక్రమానికి చర్లపల్లి జైలు , చంచల్గూడ జైలు న చంచల్గూడ మహిళా జైలు నుండి ఖైదీలని ప్యారా లీగల్ వాలంటీర్స్ ని ఎంపిక చేసారు. కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కొండల్ రెడ్డి , న్యాయవాదులు రవి, రోజా రమణి, విజ్ఞేన్ద్ర వర్మ రాథోడ్, సోషల్ వర్కర్లు శ్యామల దేవి, అమిత రాణి పాల్గొన్నారు.