నిమోనియా లక్షణాలను గుర్తించే పోస్టర్ను విడుదల
నిమోనియా లక్షణాలను గుర్తించే పోస్టర్ను విడుదల
విశ్వంభర, మహబూబాబాద్:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో శనివారం డాక్టర్ జి మురళీధర్, నిమోనియా లక్షణాలను గుర్తించే పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా వైద్యాధికారి మాట్లాడుతూ నిమోనియా అంటే ఊపిరితిత్తులలో క్రిముల ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధి అని, నిమోనియా ఒక తీవ్రమైన వ్యాధి మనదేశంలో ఐదేళ్లలోపు పిల్లలు మరణాలకు ఇదే ప్రధాన కారణమని, అందుకే ఇంటి వద్ద వైద్యంతో సమయాన్ని వృధా చేయవద్దని నిమోనియా లక్షణాలను కనిపించిన వెంటనే బిడ్డను ఆరోగ్య కార్యకర్త లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని, నిమోనియా యొక్క లక్షణాలు ముఖ్యంగా దగ్గు మరియు జలుబు ఎక్కువ కావడం వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు పక్కటెముకలు కదలడం లేదా ఛాతి లోనికి పోవడం తీవ్రమైన జ్వరం, నిమోనియా యొక్క తీవ్రమైన లక్షణాలు, తినలేక త్రాగలేకపోవడం, మగతగా ఉంటే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీసుకువెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రమీల,ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ సారంగం, హెల్త్ ఎడ్యుకేటిర్స్ కె.వి.రాజు, గీత, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, ఎల్ డి కంప్యూటర్ అరుణ్ మరి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.