తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

విశ్వంభర, హైదరాబాద్ ; తెలంగాణ తెచ్చింది కేవలం విద్యార్థులు, ఉద్యోగులు మాత్రమేనని రాష్ట్ర ఫలాలు కేవలం విద్యార్థి ఉద్యమ నాయకులకు చెందాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల కుటుంబం తెచ్చింది అని రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సాధనలో కల్వకుంట్ల కుటుంబం పాత్ర చాలా చిన్నది అని దాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని లేదని అన్నారు. ప్రజా పాలనలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. వేలాదిమంది విద్యార్థులు తమ ప్రాణాలను పన్నంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారని వాళ్ళందర్నీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల చేసి రాష్ట్ర అధ్యక్షులు గజ్జలకాంతం, జై గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వట్టికూర రామారావు గౌడ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పు బిక్షపతి,తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుడిపల్లి రవి, ఓయూ జెఏసి నాయకులు రహీం, బద్రి, దర్శనం జాన్, బొమ్మెర స్టాలిన్, కంచర్ల బద్రి,బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, మాడుగుల శివ,దేవరకొండ నరేష్ జోగు గణేష్ నక్క మహేష్ బైరపోగు సాంబశివుడు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు పాల్గొన్నారు

 

Read More నేడు నల్లగొండలో చేపట్టే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలి: రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

 

Read More నేడు నల్లగొండలో చేపట్టే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలి: రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

Tags: