కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్

కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్

*సుజాత నగర్ కరకట్ట నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
* ఎటపాక వైపు కరకట్ట మంజూరు చేయాలి

విశ్వంభర, భద్రాద్రికొత్తగూడెం:సుభాష్ నగర్ వెనుక గోదావరి కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందివ్వాలని గ్రామ సభలో సీపీఎం డిమాండ్ చేసింది. భద్రాచలం ఆర్డీవో అధ్యక్షతన జరిగిన గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో  కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల అంశం ఎజెండాగా పెట్టిన గ్రామసభలో సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడారు..కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అరా, కొర నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం మానుకోవాలని, 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.గోదావరి ముంపు నుండి భద్రాచలం రక్షణకు కరకట్ట పొడిగించాలని సీపీఎం అనేక పోరాటాలు చేసిందని ఫలితంగా వచ్చిన ఈ కరకట్టను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని అన్నారు. ప్రస్తుతం నిర్మించే ఈ కరకట్ట 700 మీటర్లు పొడవు మాత్రమే ఉందని దీనికి కేవలం 38 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. దీనితోపాటు రామాలయం నుండి సుభాష్ నగర్ కాలనీ వరకు, బుజ్జి సెంటర్ నుండి ఎటపాక చివరి వరకు కరకట్టను అభివృద్ధి చేయాలని దాని ఎత్తు పెంచి, పొడిగించాలని దానికి కావలసిన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గ్రామసభలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామితో పాటు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు, పట్టణ కమిటీ సభ్యులు నకిరికంటి నాగరాజు, భూపేంద్ర శాఖ కార్యదర్శి రాధా తదితరులు పాల్గొన్నారు.

Tags: