కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల కవిత చెరుకు రైతులను మోసం చేశారు: కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల కవిత చెరుకు రైతులను మోసం చేశారు
విశ్వంభర, మెట్ పల్లి: జువ్వాడి భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగారావు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక షుగర్ ఫ్యాక్టరీ బకాయి 170 కోట్లు చెల్లించిందని షుగర్ ఫ్యాక్టరీ ద్వారా త్వరలో కమిటీ ద్వారా ఫ్యాక్టరీని తెరిపిస్తామని గత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీ జరిపిస్తానని లేకపోతే ఉరేసుకుంటానని దొంగ హామీ ఇచ్చి గెలిసి చెరుకు రైతులను మోసం చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు కట్టిందని గత ప్రభుత్వం ఉద్యోగులకు 15వ తారీకు వరకు జీతాలు రాలేదని మా ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక ఒకటో తారీకు జీతం వస్తున్నాయని రైతులను ఉద్యోగస్తులను ప్రజలను నిరుద్యోగులను మోసం చేసి ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం. దళితులకు మూడు ఎకరాల భూమి .ఇల్లు లేని అందరికీ డబల్ బెడ్ రూమ్. స్కాలర్షిప్లు విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థులను కూడా మోసం చేసిందని , మూడేళ్ల నుంచి నా ఫోను కూడా ట్యాపింగ్ చేశారని, ప్రస్తుత ఎమ్మెల్యే పొద్దున ఒక మాట సాయంత్రం మాట మాట్లాడుతున్నాడని ఆయన మానసికంగా సైకాలజిస్ట్ కు చూయించుకొని ఆరోగ్యం సరి చేసుకోవాలని ప్రజా పాలన ప్రభుత్వం చేస్తున్న రైతులకు కొత్తగా ఉద్యోగాలు అభివృద్ధి పనులకు తట్టుకోలేక ఆందోళన చెందుతున్నాడని కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ లో మృతి చెందిన బాధితులకు ఐదు లక్షల రూపాయలు ప్రజా ప్రభుత్వం ఇవ్వగా దానిని చెక్కులు పంచుతున్నాడని కానీ ఇది ప్రజా పాలన ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి పని ప్రజాలకు తెలపడం లేదని పది సంవత్సరాలు పాలన చేసి అవినీతి అప్పులు చేసిన ప్రభుత్వము నీతి సూక్తులు చెబుతుందని ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే నేను స్టేట్ నాయకుడిని అని చెప్పుకుంటున్నారని అది ప్రజలు గుర్తించాలని అభివృద్ధిని అభివృద్ధిగా చూడాలని తప్పులుంటే తెలుపాలని కానీ ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం ,మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్ రెడ్డి ,కౌన్సిలర్ రాజయ్య ఎర్రోళ్ల హనుమాన్లు ,జట్టి లక్ష్మణ్ ,కోఆప్షన్ మార్గం గంగాధర్, మాధవరెడ్డి ,నర్సాగౌడ్ ,చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ ,పాలెపు నీల ,ముఖిమ్, సలీం , తుమ్మల పెళ్లి రాంప్రసాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.