వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఇంటింటి సర్వే
నెరవేరబోతున్న పేద వారి సొంత ఇంటి కళ
విశ్వంభర, వికారాబాద్ : మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇందిరమ్మ ఇండ్లు పథకం పేద వారి సొంత ఇంటి కళ నెరవేర్చబోతుంది. ఈ సందర్బంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల అధ్యర్యంలో సమావేశం జరిపి ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేసి ఇండ్లు లేని వారి వివరాలు ఇంటిస్థలం తో పాటు పలు అంశాల పై పక్కాగా పరిశీలన చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించాలని తుమ్మలపలి గ్రామం లో రవి జూనియర్ అసిస్టెంట్ అధ్యక్షతన కమిటీ సభ్యులు చర్చించి, ఇందిరమ్మ ఇండ్ల గురించి యాప్ లో అప్డేట్ చేసారు. ఈ కార్యక్రమం లో సభ్యులు పసుల సురేష్ , బోయిని స్వాతి , దొడ్ల అరుణ, దూదేకుల జిలాని , ఆకుల బిచప్ప , తుమ్మలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన్నే పాండు , రాజు పటేల్, కర్నె సాయిబాబా, పసుల ప్రేమాకుమార్,బోయిని శ్రీనివాస్, దొడ్ల రమేష్, బేగరి రాచయ్య, మన్నే నర్సిములు తదితరులు పాల్గొన్నారు