మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు

విశ్వంభర, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో చింతల్ ప్రాంతంలో  నివసిస్తున్న 60 మంది, జీడిమెట్ల గండి మైసమ్మ చౌరస్తా  పరిధిలో 45 మందితో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మహిళల యొక్క హక్కులు, వారికి అవసరమైన చట్టాలు కుటుంబ సమస్యలు వివాహ సంబంద సమస్యలు ను చర్చల ద్వారా సామరస్యంగా సీడీఈడబ్ల్యూ సిబ్బంది వివరించడం జరిగింది. గృహహింస బాధితుల కోసం సలహా కేంద్రం ఏర్పాటు చేశామని సెంటర్లో ఇండివిడ్యుయల్ కపుల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సర్వీసెస్ అందజేస్తామని కూడా తెలిపారు. కార్యక్రమంలో జీడిమెట్ల పీఎస్ హెచ్ ఓ జి. మల్లేష్ పీఎండబ్ల్యూ టీమ్, సీడీఈడబ్ల్యూ, జీడిమెట్ల ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది, పలువురు ఎన్.జీ.ఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: