శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా
On
శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా
విశ్వంభర, ఆమనగల్లు: కార్తీక మాసం ముగింపు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని డీసీసీబీ డైరెక్టర్ ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వెంకటేష్ గుప్తకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ప్రవీణ్ కుమార్, ఈవో మోహన్ రెడ్డి లు గంప వెంకటేష్ గుప్తాను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకొని సన్మార్గంలో పయనించాలన్నారు. ఆయన వెంట కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో కే మురళి, శ్రీనివాసరెడ్డి, రాజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.