శ్రీ సాయి ఎంక్లేవ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ శ్రీ సాయి ఎన్క్లేవ్ కాలనీలో కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాములను అత్యంత సుందరంగా అలంకరించి ముత్యాల తలంబ్రాలతో శ్రీవారి కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ అజయ్ యాదవ్,మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ కళ్యాణంలో పాల్గొని స్వామి వార్ల కళ్యాణం తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో ఘనంగా శ్రీ సీత రాముల వారి కళ్యాణం జరుపుతున్నామని, కాలనీ వాసుల సహాయ సహకారాలతో ప్రతి ఏటా కల్యాణం జరిపించడం ఆనవాయితీగా మారిందని సీతారాముల కళ్యాణం తమ చేతుల మీద జరగడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. దాదాపు ఈ అన్నదాన కార్యక్రమంలో 300కు పైగా పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాయి ఎంక్లేవ్ అధ్యక్షులు సంపత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సంజీవరావు, చైర్మన్ ఆకుల సత్యనారాయణ,జనరల్ సెక్రటరీ వెంకటరమణ, అంజయ్య, మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, కాలనీ మహిళలు,కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.