పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పున్న గణేష్ నేత ఏకగ్రీవం  

పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పున్న గణేష్ నేత ఏకగ్రీవం  

విశ్వంభర, ఎల్బీనగర్ : పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్  అధ్యక్షుడిగా పున్న గణేష్ నేత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సరూర్నగర్ లోని హుడా కాంప్లెక్స్ లో పద్మశాలి  సంఘం సర్కిల్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన ఎన్నిక  సమావేశంలో సభ్యులందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ అధ్యక్ష ఎన్నికలో సర్కిల్ సంఘ మార్గ దర్శకులు సీత ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి సంఘానికి రెండవసారి కూడా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎల్బీనగర్ పద్మశాలి  సంఘం సర్కిల్ కి నన్ను నమ్మి మరోసారి ఏకగ్రీవంగా అవకాశం కల్పించిన తోటి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో సంఘ అభివృద్ధికి మరింత దోహద పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మి నారాయణ , పద్మశాలి మేళా కమిటీ అధ్యక్షుడు కౌకుంట్ల రవితేజ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, సర్కిల్  ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్ పద్మశాలి , వేమూరి రాధాకృష్ణ , మహిళలు తదితరులు పాల్గొన్నారు.  

Tags:  

Advertisement

LatestNews