కుర్మేడు కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

విశ్వంభర, చింతపల్లి : ప్రజాధనాన్ని అక్రమంగా వృధా చేస్తున్న కుర్మేడు కార్యదర్శి పై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుర్మేడు గ్రామస్థుడు గౌని జంగయ్య అన్నారు. గురువారం గ్రామ ప్రత్యేక అధికారి ఎమ్మార్వో రమాకాంత్ శర్మ కు వినతి అందచేసి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న మురళీమోహన్ ఎలాంటి తీర్మానాలు లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది జీతాల పేరిట గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు పోలేపల్లి గ్రామానికి చెందిన సైదులు కు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు జీతంగా ఇవ్వడం జరిగిందన్నారు. మరొకసారి సిబ్బంది జీతాల పేరిట తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో వారి అకౌంట్లో  డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. కుర్మేడు గ్రామస్తుల వద్ద ఖాళీ ఇండ్ల స్థలాలను  ఆన్లైన్లో ఎంటర్ చేసి యాజమాన్యం హక్కు పత్రం, అసెస్మెంట్ నెంబర్లు  ఇవ్వడం జరుగుతున్నదని  తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.

Tags: