రక్తదాన శిబిరానికి హనుమాన్ టెంపుల్ ప్రధాన అర్చకులు జోషి సుధాకర శర్మకు ఆహ్వానం 

రక్తదాన శిబిరానికి హనుమాన్ టెంపుల్ ప్రధాన అర్చకులు జోషి సుధాకర శర్మకు ఆహ్వానం 

  • ఆహ్వానించిన మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ 

విశ్వంభర, బిఎన్.రెడ్డి నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా మదర్ థెరిస్సా  చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో    ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో10/04/2025 గురువారం రోజున సెల్ఫ్ ఫైనాన్స్ కాలనిలో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు శ్రీరామ్ రామభక్త హనుమాన్ టెంపుల్ ప్రధాన అర్చకులు జోషి సుధాకర శర్మని  హాజరు కావాలని ఇన్విటేషన్ కార్డు అందజేశారు.  భారతదేశంలో రోజుకు 12,000 మంది తల సేమియా  బాధితులు సరైన సమయంలో రక్తం అందక మరణిస్తున్నారు.  మా సంస్థ ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తూ ఉందని  మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ తెలిపారు. 

Tags: