ఘనంగా చేపూరి శంకర్ జన్మదిన వేడుకలు - పుట్టినరోజు సందర్బంగా వృద్దులకు అన్నదానం 

ఘనంగా చేపూరి శంకర్ జన్మదిన వేడుకలు -  పుట్టినరోజు సందర్బంగా వృద్దులకు అన్నదానం 

  • - మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ  

విశ్వంభర, వనస్థలిపురం : మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు చేపూరి శంకర్ జన్మదినం సందర్బంగా  రెడీ టు సర్వ్  ఫౌండేషన్ లో  వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా  సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ  పవిత్రమైన దేవాలయంలో నా యొక్క పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఎంతో అదృష్టం అని,  తల్లిదండ్రులు పెంచి పోషించి పెద్ద చేసిన తర్వాత వారు తల్లిదండ్రులు చూడడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు.  వారు కష్టపడి మనల్ని ఇంత పెద్ద స్థాయికీ తీసుకొచ్చిన తర్వాత కూడా వారిని మనం గుర్తించలేకపోతున్నాం చాలా బాధాకరమైన విషయం.   తల్లిదండ్రులను ఎప్పుడు బాధ పెట్టకుండా ఉండడమే దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం అని అన్నారు.  వృద్ధుల ఆరోగ్యం గురించి అడిగి  తెలుసుకున్నారు. కార్యక్రమంలో  నిర్వాహకులు పెద్దిశంకర్ గౌడ్,  పాల్గొన్న చేపూరి సందీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: