సామాజిక బాధ్యతతో సాగిన అక్షరం - కడారి శ్రీనివాస్ కలం.
ఉత్తమ జర్నలిస్టుగా ఉగాది పురస్కారం..

- భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డు ప్రధానం..
- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు
అవార్డు ప్రధానోత్సవం.
విశ్వంభర, విజయవాడ : జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ( ఆంధ్ర ప్రదేశ్) ప్రతి సంవత్సరం ప్రఖ్యాతిగాంచిన వారందరికీ ఉగాది పురస్కారాలను అందజేస్తుంది. ఈ సందర్భంగా జర్నలిజంలో అత్యంత అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు ఈ అవార్డులను ప్రధానం చేస్తుంది. 2024 - 25 సంవత్సరానికి గాను అవార్డుల జాబితాలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు తాజాగా ప్రకటించారు.
ఈ సంవత్సరానికి గాను అర్హులైన పలువురు జర్నలిస్టుల పేర్లు ప్రకటించిన వారిలో తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కవి రచయిత గాయకులు శ్రీ కడారి శ్రీనివాస్ ను ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తన సేవలు అందించినందుకు గాను, అలాగే సామాజిక బాధ్యత యువతను తప్పుదోవ పట్టిస్తున్న వైనాన్ని అక్షర రూపేనా సంధిస్తూ ప్రతిక్షణం సమాజ హితం కోసం రాసే ఆర్టికల్స్ విశేష ఆదరణ పొందాయి. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నేడు 12వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో... భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి "జస్టిస్ వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు ప్రధాన ఉత్సవం జరగనుంది. కవిగా రచయితగా గాయకుడిగా సీనియర్ జర్నలిస్టుగా 18 సంవత్సరాల అనుభవంతో ఎన్నో శాటిలైట్ ఛానల్లో చేసి ప్రస్తుతం జయభేరి పత్రికకు ఎడిటర్ గా చేస్తూ విభిన్న అంశాలపై సామాజిక బాధ్యత కలిగిన విధంగా సీనియర్ జర్నలిస్టుగా కడారి శ్రీనివాస్ సంధించిన అక్షరం ఒక్కొక్కటి ప్రభుత్వాలను ఎక్కడికక్కడ నిలదీశాయి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేకంగా కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ అనే శీర్షిక ద్వారా ఎన్నో రాజకీయ విభిన్న అంశాలపై ఆర్టికల్స్ ను రాస్తూ పత్రిక రంగంలో తనకంటూ ఓ పేరును ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా గర్వపడుతున్నాను అంటూ కడారి శ్రీనివాస్ ఉద్విగ్న భరితుడయ్యారు.ఈ సందర్భంగా ఎన్నెన్నో ఆర్టికల్స్ సామాజిక స్పృహతో రాసినవే... ఇలాంటి అవార్డు దక్కడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఎన్నో అవార్డులు భవిష్యత్తులో అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.