నూతన బస్ ప్రారంభం
On

విశ్వంభర, ఎల్బీనగర్ : కుంట్లూరు నుంచి జేబీఎస్ వరకు నూతన బస్ ప్రారంభించడం పట్ల నాగోల్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు పంగా శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. కుంట్లూరు జేబీఎస్ బస్ నడిపించాలని కోరుతూ మార్చి 24వ తేదీన శ్రీకాంత్, చరణ్ రెడ్డిలు బండ్లగూడ బస్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లుకి వినతి పత్రాన్ని సమర్పించారు. వారి వినతి మేరకు గురువారం నూతన బస్సును 90B/కే కుంట్లూర్ నుంచి జేబీఎస్ బస్ స్టేషన్ వరకు నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యెల్ల పంతుల చంద్రశేఖర్, కాలం శెట్టి లయ, ఎడ్ల రాజేష్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.]