"నవార"వరి కూలీలతో కోత

- హార్వెస్టర్ తో మిత్ర కీటకాలు ముప్పు.
- జిల్లా ఉత్తమ రైతు వెంకన్న పటేల్.
విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి లో జిల్లా ఉత్తమ రైతు పెండెం వెంకన్న పటేల్ సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన ఆరోగ్య ప్రదాయిని నవార వరి కోతను బుధవారం కూలీలతో కో యించారు.ఈ సందర్భంగా రైతు వెంకన్న మాట్లాడుతూ..వరి నారు విత్తిన నాటి నుంచి 120 రోజుల్లో వరి పంట కోతకు రావడంతో కోస్తున్నామన్నారు.వరి పంటను హార్వెస్టర్ యంత్రంతో కోసే అవకాశం ఉన్నప్పటికీ యంత్రం బరువుకు,వైబ్రేషన్ వలన భూమిలోని ఎర్రలతో పాటు,పంటల మిత్ర క్రిమి కీటకాలు చనిపోతాయన్నారు.గడ్డిలో పోషక విలువలు తగ్గి పశువులకు ఉపయుక్తంగా ఉండదన్నారు. నవా రార వరి రకం బియ్యం షుగర్ వ్యాధిని,శారీరక అధిక బరువును నియంత్రిస్తుంది.పక్షవాతం,మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుందని తెలిపారు. కాక సంపందిత వరి కోత పనులను వ్యవసాయ కళాశాల రావెప్ ప్రోగ్రాం విద్యార్థిని బాలినేని ఉషా రెడ్డి సందర్శించి పరిశీలించారు.