199వ బూత్ లో బీజేపీ ఆవిర్భావ వేడుకలు

199వ బూత్ లో బీజేపీ ఆవిర్భావ వేడుకలు

విశ్వంభర, ఆమనగల్: భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  ఆమనగల్లు మున్సిపాలిటీ 1వ వార్డు 199వ బూత్ లో మున్సిపల్ అధ్యక్షుడు కర్నాటి విక్రం రెడ్డి,మాజీ కౌన్సిలర్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చెక్కల లక్ష్మణ్, అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షుడు కేతావత్ రాములు నాయక్ బిజెపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ బీజేపీ అని, బీజేపీ ప్రభుత్వం ఎల్లవేళలా దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
 ఈ కార్యక్రమంలో నాయకులు బీజేవైఎం యూత్ అధ్యక్షులు సురేందర్, గోపాల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, మల్య నాయక్, సజ్య నాయక్, దేవుసింగ్ నాయక్, లక్య నాయక్, అంబ్రియా నాయక్, పాండు,రమేష్, హరి,సిద్దు రాజేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: