మహిళలకు ఆదర్శంగా రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాపోలు సువర్ణ

కుట్టుమిషన్ శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్స్ ప్రధానం

మహిళలకు ఆదర్శంగా రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాపోలు సువర్ణ

విశ్వంభర/ మేడిపల్లి: రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు  టైలరింగ్ శిక్షణ కాలపరిమితి పూర్తయినందున శుక్రవారం నాడు ట్రస్ట్ ఫౌండర్ రాపోలు సువర్ణ వారికి సర్టిఫికెట్లు  అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, ట్రస్ట్ ఫౌండర్ రాపోలు సువర్ణ పాల్గొని సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రాపోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మంది మహిళలకు ఆదర్శంగా ఉంటూ,ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కమిటీ హాళ్లలో ఏర్పాటు చేసి వారి అభ్యున్నత ఉపాధికై ముందు అడుగు సహృదయంతో వారికి ఉపాధి కల్పించిన రాపోలు సువర్ణకి మహిళలు ధన్యవాదాలు తెలిపారు. తాను సోషల్ వర్కర్ గా మహిళలలో ఆత్మ స్థైర్యాన్ని పెంచుతూ వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా మహిళ అభివృద్ధికై తన వంతు సాయం చేస్తున్నానంటూ ట్రస్ట్ ఫౌండర్ రాపోలు సువర్ణ పేర్కొన్నారు. ఇవే కాకుండా ఇకముందు మహిళల కోసం బ్యూటిషన్, కంప్యూటర్ లాంటి కోర్సు కూడా తీసుకువస్తామని శిక్ష అర్హులు ఎవరైనా ఈ కోర్సులలో చేరవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సమతా యాదవ్ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు నిర్మలారెడ్డి కమిటీ ఉపాధ్యక్షురాలు విమల సింగిరెడ్డి మంగమ్మ,కమిటీ ప్రధాన కార్యదర్శి రేవతి ,కార్యదర్శి రజిత ,మహిళా నాయకురాలు విజయలక్ష్మి, సరిత, భువనేశ్వరి, వి ఎస్ పి తరంగిణి ,ఏసుమని, గడ్డం అనిత, ఫెడరేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Tags: