నాంపల్లి లో మెగా రక్తదాన శిబిరం

విశ్వంభర, బషీర్ బాగ్ : హైదరాబాద్ డిఈఓ కార్యాలయ సూపరిండెంట్ రవికాంత్ పదవి విరమణ సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్, టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కె. ఆర్. రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం. భాస్కర్, ఉపాధ్యక్షుడు రుగేష్, సంయుక్త కార్యదర్శి జయంతి రెడ్డి, ప్రచార కార్యదర్శి మైరవి, ప్రియ, ముజ్జాయిద్ లు రవికాంత్ ను పుష్ప గుచ్చం అందజేసి శాలువా తో ఘనంగా సన్మానించారు.ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా కేఆర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 11న నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, అరుణ, విజయలక్ష్మి, సుగుణారెడ్డి, ప్రవీణ, అర్చన, చంద్రశేఖరరెడ్డి, రామకృష్ణారెడ్డి, హైమావతి, శేషిరత్న, జేమ్స్ బేసర్,ఫయాజ్, సి.ప్రరెడ్డి, ఇమ్రాన్,రాణి, రేణుక, గిరిజ, నర్సింహ, హేమావతి, సంతోష్, వెంకటేష్ పాల్గొన్నారు.