భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి యాగం.
On

విశ్వంభర, ఎల్బీనగర్ : ఆర్కే పురం డివిజన్ వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో గత నాలుగు రోజులుగా శ్రీ మహాలక్ష్మి యాగం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రాణవేష్టి యజ్ఞం లోకంలో పాడిపంటల సమృద్ధి కోసం శ్రీ లక్ష్మీనారాయణ లక్ష తులసి అర్చనలు ప్రధాన యాగశాలలో శ్రీ మహాలక్ష్మి యాగ నిత్య పూర్ణాహుతి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం తదితర కార్యక్రమాలు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణం మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి శ్రీ అహోబిల రామానుజర స్వామి, పలువురు స్వాములు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.