బస్తీ దవాఖాన కు కేటాయించిన స్థలం కబ్జా

బస్తీ దవాఖాన కు కేటాయించిన స్థలం కబ్జా

  • రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు
  • పట్టించుకోని రెవెన్యూ అధికారులు

విశ్వంభర, సంగారెడ్డి జిల్లా :  పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 993లో గోశాల పక్కనగల ప్రభుత్వ భూమిలో గవర్నమెంట్ బస్తీ దవాఖానా కొరకు కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని బస్తీ దవాఖాన కేటాయించిన క్రమములో బస్తీ దవఖాన కి సంబంధించిన ప్రభుత్వ స్థలంలో కొంతమంది కబ్జాలు చేసి యధేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. గతంలో కూడా ఈ అక్రమ నిర్మాణాలపై రెవిన్యూ అధికారులు కూల్చివేతలునిర్వహించినప్పటికి మళ్లీ రాత్రికి రాత్రి నిర్మాణలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై విశ్వంబర దినపత్రికలో వార్తలు ప్రచురించినప్పటికీ అమీన్పూర్ రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలకు నోచుకోలేదు. ఈ అక్రమ కట్టడాల వెనుక కొందరి అధికారుల చల్లని చూపులు ఉన్నాయని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బస్తీ దావఖాన కు సంబంధించిన స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను చేపట్టిన వారి పై తగిన చర్య తీసుకోగలరనీ ప్రజల కోరుతున్నారు.

Tags: