సీఎం వైఫల్యంతోనే హైదరాబాదులో మంచినీటి సమస్య తీవ్రం
వేసవిలో ప్రజలు దాహార్తిగా ఉన్నా, ప్రభుత్వానికి చలనం లేకుండా పోయింది - ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
విశ్వంభర, ఎల్బీనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యంతోనే హైదరాబాదులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని,
వేసవిలో ప్రజలు దాహార్తిగా ఉన్నా, ప్రభుత్వానికి చలనం లేకుండా పోయింది అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్, ఎన్టీఆర్ నగర్ లో మంచినీటి సమస్య తలెత్తిందని తెలిసి జలమండలి, జిహెచ్ఎంసి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి బుధవారము పర్యటించారు. ఈ సందర్భంగా సబితా రెడ్డి మాట్లాడుతూ గడచిన 10 సంవత్సరాలుగా కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీరు నిరంతరంగా అందింది. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 3 నెలలుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది అని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఏ వీధిలోకి వెళ్ళిన మంచినీటి సమస్య తలెత్తుతుందని, ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయని అన్నారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందా? అని అన్నారు. ఈ మండువేసవిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరం. ప్రజలు నిలదీసిన తర్వాతే అధికారులు స్పందించాల్సి వస్తుందా? అని ప్రశ్నించారు.ప్రజల ఆకాంక్షల మేరకు మార్పు తీసుకొస్తామన్న ప్రభుత్వం, కనీసంగా తాగునీటి లాంటి ప్రాధమిక అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది. అయినా ఇప్పుడు అయినా అధికార యంత్రాంగం కళ్లతెరిచి, తక్షణమే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రికి భూములు అమ్మటంపై పెట్టిన శ్రద్ధ, ప్రజా సమస్యలు తీర్చడం లేదు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, న్యాల కొండ శ్రీనివాస్ రెడ్డి, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, సాజిద్, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, కంచర్ల శేఖర్, శ్యామ్ గుప్తా, వాజిద్, జగన్, జహీద్, రహీం, శ్రీకాంత్ గౌడ్, కుమార్, ఊర్మిళా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



