పోలీస్ యాక్ట్ అమలు
On

విశ్వంభర, సిద్దిపేట : కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని సీపీ అనురాధ తెలిపారు. ఈనెల 13 నుంచి 28వరకు అమల్లో ఉంటుందన్నారు. ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకారించాలని కోరారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరైతే సంబంధిత డివిజన్ ఏసీపీల అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ.