అకాల వర్షం.. అపార నష్టం రైతన్నపై ప్రకృతీ పగబట్టినట్టుంది!

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటా - ఎమ్మెల్యే డా.మురళీ నాయక్

అకాల వర్షం..  అపార నష్టం రైతన్నపై  ప్రకృతీ పగబట్టినట్టుంది!

విశ్వంభర, మహబూబాబాద్ :  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పీక్ల తండా , క్యాంపు తండా, నారాయణపురం గ్రామాల్లో వడగండ్ల వర్షంతో నష్టపోయిన వరి,మొక్క జొన్న పంటలను ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్  పరిశీలించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు నష్టపరి హారాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు.  దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, పంటలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్య పడ వద్దని అండగా ఉంటానని ఎమ్మె ల్యే డా. మురళీ నాయక్ భరోసా ఇచ్చారు. పీక్ల తండా గ్రామపంచాయతీ వాచ్య తండాలో అకాల వర్షానికి దెబ్బతిన్న ఇండ్లను,బాధిత కుటుంబాలను పరిశీలించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న,మాజీ టీపీసీసీ సభ్యులు దస్రు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి దయాకర్, డైరెక్టర్ గుగులోత్ వీరన్న నాయక్, జిల్లా యూత్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, జిల్లా యూత్ నాయకులు గుగులోత్ నరేష్ నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ నాయకులు, రైతులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: